ASF: కాగజ్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ “సంఘటన్ శ్రీజన్ అభియాన్” కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి AICC అబ్జర్వర్ నరేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. జిల్లా కాంగ్రెస్ కమిటీలను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం, కార్యకర్తలతో సమన్వయం పెంచడం, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.