AKP: హోంమంత్రి వంగలపూడి అనిత చొరవతో పాయకరావుపేట నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ రహదారుల అభివృద్ధికి రూ.14.60 కోట్లు మంజూరైనట్లు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు తెలిపారు. ఆదివారం పాయకరావుపేటలో మాట్లాడుతూ.. కోటవురట్ల, ఎస్ రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో 30 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.