VSP: విశాఖలో రాబోయే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రినారా లోకేష్ అన్నారు. ఆదివారం కల్టెరేట్లో అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని.. అభివృద్ది వికేంద్రీకరణ నినాదంతో నాడు మీ ముందుకు వచ్చాం. 94 శాతం సీట్లతో మమ్మల్ని గెలిపించారు. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని తెలిపారు.