MBNR: జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అరుదైన మొక్కలు, ఆర్కిడ్లు పుష్పిస్తున్నాయని ప్రిన్సిపాల్ జి.సుకన్య తెలిపారు. ముఖ్యంగా నల్లమలలో 160 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన హెటెరోస్టెమ్మ బెడ్రోమి అనే అరుదైన తీగజాతి మొక్క ఇక్కడ వికసించిందని గార్డెన్ సమన్వయకర్త బి.సదాశివయ్య వెల్లడించారు.