GNTR: తెనాలి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆదివారం రాత్రి త్రీ టౌన్ పోలీసులు వాహన తనిఖీల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్ఐ కరిముల్లా, పీసీ మురళి, సిబ్బంది కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు. సెల్ ఫోన్, మైనర్ డ్రైవింగ్తో పాటు నెంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలు గుర్తించి వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.