VZM: ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్ పడాల్ వివరాల మేరకు చందులూరు గ్రామానికి చెందిన కే. సంతోష్ విశాఖ విమానాశ్రయంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆర్ధిక సమస్యలు వెంటాడడంతో శనివారం గడ్డి మందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.