కడప జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. రాయచోటి రహదారి ఫ్లైఓవర్ సమీపంలో కడప నగరంలోని శంకరాపురానికి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎర్రగుంట్ల రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. వారి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. సమీపంలో కడప నబి కోటకు చెందిన శివ అనే వ్యక్తి మృతదేహం కూడా కనిపించినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు.