E.G: రాజానగరం మండలం పాతవెలుగు బంద గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం సాయంత్రం సమాచారం అందుకున్న రాజానగరం ఎస్సై పీ. నారాయణమ్మ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుంచి రూ.1,200, రెండు కోడి పుంజులను, 6 బైక్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.