NLR: బుచ్చి దగదర్తి రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో 38 కోట్లు రూపాయలతో నిధులు మంజూరు కాగా ఇప్పటివరకు రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. బిల్లులు మంజూరులో ఆలస్యంగా ఉన్న కారణంగా పనులు ఆగిపోయాయని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించి రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.