NZB: మోస్రా మండలం చింతకుంటలో గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన చింతకుంట ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఐపీఎల్ తరహాలో జట్లను ఎంపిక చేసుకొని ఆడిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో సన్ రైజర్స్ గ్లాడియేటర్స్, సన్ రైజర్స్ ప్రిడెక్టర్స్ తలపడగా గ్లాడియేటర్స్ విజేతగా గెలుపొందినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు