VZM: జిల్లా వాసి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గొర్రెపాటి బుచ్చి అప్పారావు 112వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటలకు గంట్యాడ మండలంలోని తాటిపూడి గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.