AP: మంత్రి లోకేష్ టీమిండియా క్రీడాకారుల సంతకాలతో కూడిన టీషర్టును బహుమతిగా అందుకున్నారు. ACA-VDCA స్టేడియంలో భారత్-ఆసీస్ మహిళా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను తిలకించేందుకు వచ్చిన ఆయనకు ఆసియాకప్ టీమిండియా జట్టు మేనేజరుగా వ్యవహరించిన PVR ప్రశాంత్ టీషర్టును అందజేశారు. ఆసియాకప్ గెలుచుకున్న ప్లేయర్ల సంతకాలతో కూడిన టీ షర్టును చూసిన లోకేష్ కుమారుడు దేవాంశ్ మురిసిపోయాడు.