VZM: సూపర్ GST-సూపర్ సేవింగ్స్ గురించి ప్రజలలో చైతన్యం తెచ్చుటకు సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కార్మిక అధికారి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కలెక్టర్ కార్యాలయం నుండి విజయనగరం పట్టణంలో ముఖ్య కూడళ్ళ గుండా ప్రచారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ నిపుణులు, కంపెనీ ప్రతినిధులు, పాల్గొననున్నారు.