NZB: సిరికొండ మండలంలోని సత్యశోధక్ పాఠశాలలో ఆదివారం నిజామాబాద్ సబ్ డివిజన్ తపాల శాఖ సహాయ పర్యవేక్షకులు సునీత బెనర్జీ ఆధ్వర్యంలో దీన్ దయాల్ స్పర్శ్ యోజన రాష్ట్ర స్థాయి జనరల్ నాలెడ్జ్ పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. పరీక్షల పట్ల అవగాహన కలిగి ఉండాలని విషయ పరిజ్ఞానం అవసరం అన్నారు. తపాలా సంస్థ ప్రయోజనాలను తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.