KDP: జమ్మలమడుగు భాగ్యనగర్ కాలనీకి చెందిన పెద్ద హసన్ సాహెబ్ (45) బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హసన్ సాహెబ్ గురించి సమాచారం తెలిస్తే 9121100603, 9121100604 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.