SDPT: కోహెడ మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల వేధింపులు తాళలేక మండలానికి చెందిన వేల్పుల సంపత్ (39) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. అధిక వడ్డీలు చెల్లించలేకపోయాడని, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడాని పేర్కొంది.