NDL: ఈనెల 16న ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. ఆదివారం శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. శ్రీశైల పరిసర ప్రాంతాలలు, నల్లమల అడవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ సాయుధ బలగాలు ప్రధాని పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.