AP: ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా మద్యం బాటిల్‌పై ఉండే QR కోడ్‌ను స్కాన్ చేస్తే సీసా గురించి వివరాలన్నీ తెలుస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. స్కాన్ చేశాక తయారీ కేంద్రం, తేదీ, బ్యాచ్ అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతోందని చెప్పారు. ఎవరైనా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే వారి బెల్ట్ తీస్తామని హెచ్చరించారు.