ELR: నూజివీడులోని కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్లో రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాలక్ష్మికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు ఆదివారం ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా విజయవాడలో నేడు అవార్డు అందించారు.