NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్ మండలాల కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించనున్నామని ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. డీసీసీ నూతన అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఖానాపూర్ పట్టణంలోని జెకె ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకుల సమావేశం ఉంటుందన్నారు. ఆ సమావేశానికి అందరూ రావాలన్నారు.