E.G: బీసీ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎస్. సవిత ఆదేశించారు. ఆదివారం రాజమహేంద్రవరంలో బీసీ సంక్షేమ, చేనేత, జౌళి, లేపాక్షి శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమం, విద్యావసతుల మెరుగుదల, హాస్టల్స్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.