NLG: చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం సోమవారం ఉదయం 11:00 గంటలకు నకిరేకల్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీరేశం అధ్యక్షతన జరగనుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ తెలిపారు. కాంగ్రెస్ గ్రామ శాఖల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, మండల, జిల్లా నాయకులు, కార్యకర్తలు విచ్చేయాలని విజ్ఞప్తి చేశారు.