WNP: బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేందుకు అగ్రకులాల కుట్ర కొనసాగుతోందని బీజీవీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివనాయక్ విమర్శించారు. రాష్ట్ర జనాభాలో 60% ఉన్న బీసీలకు సామాజిక న్యాయం అందించాలనే ఉద్దేశంతో ప్రతిపాదించినా, 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం వెనుక కొంతమంది కుట్రదారుల చెడు ప్రణాళిక ఉందని ఆయన ఆరోపించారు.