ASR: కాఫీ కార్మిక హెల్పర్ల సంఘం అధ్యక్షుడిగా కొర్ర రాజు, ప్రధాన కార్యదర్శిగా మోరి వెంకటగిరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ తెలిపారు. ఆదివారం చింతపల్లిలో కాఫీ కార్మిక హెల్పర్లు సమావేశమయ్యారు. నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా ఎన్.కనకవల్లి, మారిమత్తు వెంకటేశ్, కొర్రా రామారావు, సింహాచలం ఎన్నికయ్యారు.