ASF: దహేగాం మండలం గిరివెల్లికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఆదివారం మాజీ MLA కోనేరు కోనప్ప సమక్షంలో BRSలో చేరారు. వారికి కోనప్ప గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. BRSతోనే అభివృద్ధి సాధ్యమని, కోనప్ప నాయకత్వంలో పనిచేయడానికి తాము పార్టీలో చేరినట్లు నూతన నాయకులు తెలిపారు.