GDWL: ‘ధన్ ధాన్య యోజన’ పథకం రైతుల పాలిట వరం అని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతులు ఆర్థిక అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధన్ ధాన్య యోజన పథకంలో జిల్లాను చేర్చడం పట్ల ఇవాళ అయిజలో మండల అధ్యక్షుడు గోపాలకృష్ణతో కలిసి పీఎం మోదీ చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు.