NZB: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పీసీసీ అధికార ప్రతినిధి కమ్మర్‌పల్లికి చెందిన సీనియర్ నాయకుడు బాస వేణుగోపాల్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ నిర్మాణ పటిష్టత కోసం నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. జిల్లా అబ్జర్వ్ కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.