AP: కల్తీ మద్యాన్ని గుర్తించే ఎక్సైజ్ సురక్షా యాప్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మలకలచెరువు నకిలీ మద్యం కేసులో 23 మంది నిందితులను గుర్తించి, 16 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు జనార్థన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి నేరాలు చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.