NRPT: PDSU జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలోని భగత్ సింగ్ భవన్లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నవంబర్ 15, 16 తేదీలలో జిల్లా కేంద్రంలో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభలకు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు.