కడపలోని ఎర్రముక్కపల్లి సర్కిల్ నుంచి వెంకటేశ్వర డిగ్రీ కళాశాల,బాలాజీ నగర్, చెమ్ముమియాపేట ప్రాంతాలకు వెళ్లే దారి పలుచోట్ల గుంతల మయంగా మారింది. ఈ మార్గంలో ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. విద్యార్థులు కళాశాల, పాఠశాలలకు వాహనాలపై వెళుతుంటారు. ఎర్రముక్కపల్లి సమీప వంతెన వద్ద పెద్దపాటి గుంతలు ఏర్పడ్డాయి. మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.