BHPL: మహదేవపూర్(M)కాలేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో వరద ప్రవాహం తగ్గుతుంది. ఇవాళ సాయంత్రం 92,310 క్యూసెక్కుల వరద నమోదైందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 24 వేల క్యూసెక్కులు తగ్గినట్లు పేర్కొన్నారు. సుందిళ్ల పార్వతి బ్యారేజీ నుంచి 1,06,550 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 44,415 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా ఉన్నట్లు తెలిపారు.