కృష్ణా: బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలోని పాలకేంద్రం వద్ద రహస్య సమాచారంతో జూదం ఆడుతున్న వ్యక్తులపై ఎస్సై ఎం. శ్రీనివాస్ ఆదివారం దాడి చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్ 9(1) ప్రకారం జూదం ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.4,330 నగదు, 5 మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేశారు.