BHPL: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్‌కు డీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు దరఖాస్తులు అందజేశారు. ఈ క్రమంలో టీపీసీసీ ఓబీసీ కో-ఆర్డినేటర్ రవీందర్ తన బయోడేటాను సమర్పించి అధ్యక్ష పదవికి దరఖాస్తు చేశారు. తన నియామకానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు, యూత్ నాయకులు సహకరించాలని రవీందర్ కోరారు.