NLG: అంతరాలు లేని విద్యను అందించాలని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ఇవాళ నల్గొండలోని UTF భవన్లో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘విద్యలో అంతరాలు తొలగిపోయేదెట్ల?’ అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. అంతరాలు లేని విద్య సమాజాన్ని నిర్మించుకోవాలని, కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరచాలని ఆయన కోరారు.