AP: కల్తీ మద్యం కేసును కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తప్పు చేసిన వారు ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ములకలచెరువు నిందితులు ఆఫ్రికాలో నేర్చుకున్నది ఆంధ్రాలో అమలు చేయాలని ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ మేరకు మద్యం కేసు విచారణకు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.