MDK: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్ష ఎన్నికల కోసం ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతుల, అన్సారిల ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని జ్యోతి రౌతుల తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు అభిప్రాయాలు సేకరించి, వాటి ఆధారంగానే ఎన్నిక జరుగుతుందన్నారు.