ASR: కొయ్యూరు మండలం బూదరాళ్ల సచివాలయ గ్రామ ఉద్యాన సహాయకుడు(వీహెచ్ఏ) పీ.ప్రభాకరరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. హిప్ రీప్లేస్ మెంట్ చేయాలని, శస్త్రచికిత్స అవసరం అవుతుందని వైద్యులు తెలిపారు. త్వరగా కోలుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి బాలకర్ణ ఆకాంక్షించారు.