కృష్ణా: కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టించి అభివృద్ధి చేస్తున్నట్లు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఆదివారం సాయంత్రం తాడిగడప మున్సిపాలిటీ పోరంకిలో అంతర్గత రోడ్డు నిర్మాణానికి రూ.60.50 లక్షలతో నూతన రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండేలా పని చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.