సత్యసాయి: పుట్టపర్తిలోని చిత్రావతి నది తీరం అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. వాకింగ్ ట్రాక్లు, పచ్చదనం, లైటింగ్, పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు తీరం పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.