BHNG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇవ్వాళ అడ్డగూడూరు మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.