KKD: కోటనందూరు మండలంలో బాణాసంచా విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని ఎస్సై రామకృష్ణ ఆదివారం హెచ్చరించారు. అక్రమంగా బాణాసంచా నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుకాణదారులు తప్పనిసరిగా భద్రతా జాగ్రత్తలు పాటించాలన్నారు.