VSP: దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో దసరా మహా అన్నదానానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10,000 విరాళం అదివారం అందజేశారు. వైసీపీ వార్డు అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఆసీలమెట్ట కార్యాలయంలో నగదు అందజేశారు. పేదవాడి ఆకలి తీర్చే కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటానని వాసుపల్లి తెలిపారు. జాన్ వెస్లీ, సనపల రవీంద్ర భరత్ తదితరులు పాల్గొన్నారు.