JGL: పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామంలో గడ్డి మందు కలిపిన నీళ్లు తాగి 6 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన దండవేని శంకర్ తన గొర్రెలను మేత కోసం మేఘా క్యాంపుకి వెళ్లాడు. క్యాంపు ఆవరణలో పిచ్చి గడ్డి నివారణ కోసం గడ్డి మందు కలిపిన నీళ్లు బకెట్లో నిల్వ ఉంచగా వాటిని గొర్రెలు తాగాయి. 6 మృతి చెందగా మరికొన్ని గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి.