NGKL: కొల్లాపూర్‌కు చెందిన రామకృష్ణ (24) నాగర్ కర్నూల్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో ఉంటూ, మెకానిక్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రామకృష్ణ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.