ASF: రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని MLA హరీష్ బాబు అన్నారు. శనివారం కాగజ్ నగర్ MJP రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థికి పాము కాటేసింది. విషయం తెలుసుకున్న MLA ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థిని ఆదివారం పరామర్శించారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.