SKLM: గార మండలం కళింగపట్నం సముద్రతీరాన ఆదివారం కావడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది. దీంతో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై మెట్ట వైకుంఠరావు ఆధ్వర్యంలో సిబ్బంది భద్రత చర్యలు చేపట్టారు. సముద్రంలోకి వెళ్లే పర్యాటకులకు పలు సూచనలు అందజేశారు. అలలు ఎక్కువగా వస్తున్న వైపు ఎటువంటి పరిస్థితులలో పోవద్దంటూ సూచించారు. రద్దీ ఎక్కువగా ఉందన్నారు.