PPM: పార్వతీపురం మండలం కొత్తపట్నం గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. ఈ మేరకు గ్రామ సమీప వరి చేలలో తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయన్నారు. ఏ సమయంలో గ్రామాలలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వాటిని తరలించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.