ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ మ్యాచులో భారత అమ్మాయిల జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ప్రతిక(75)-మంధాన(80) శుభారంభం అదించగా.. 48.5 ఓవర్లలో 330 రన్స్ చేసింది. హర్లీన్(38), రోడ్రిగ్స్(33), రీచా(32) పర్వాలేదనిపించగా.. టెయిలెండర్లు వెంటవెంటనే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 5 వికెట్లతో రాణించగా సోఫీ 3 వికెట్లు పగడొట్టింది. ఆసీస్ టార్గెట్ 331 రన్స్.