WGL: వర్ధన్నపేట పట్టణంలో తెలంగాణ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సమావేశంలో ఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి ఆటోకార్మికుల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను దెబ్బతీస్తున్నాయని, ఫ్రీబస్సుల వల్ల ఆటోడ్రైవర్లు జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.