MLG: తాడ్వాయి మండలం మేడారంలో సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 10:30 గంటలకు చేరుకుని, మహా జాతర ఏర్పాట్లు, గద్దెల విస్తరణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధికారులు ఇవాళ తెలిపారు.